![]() |
![]() |

ఢీ షోలో మంచి డాన్సస్ తో పాటు మంచి స్కిట్స్ కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు టీచర్స్ డే వస్తున్న సందర్భంగా ఆ టాపిక్ మీద ఈ వారం డాన్సర్స్ తమ పెర్ఫార్మెన్సెస్ చేసి చూపించారు. ఆ స్కిట్స్ వేయడానికి ఆది, దీపికా పిల్లి ఆల్రెడీ ఉన్నారు. దీపికా వాళ్ళ చుట్టాలు పేరుతో ప్రతీవారం ఒక్కో గెస్ట్ ని పిలుస్తూ ఉంటుంది. ఇక ఈ వారం హైపర్ ఆది తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించడానికి డైరెక్టర్ గెటప్ లో వచ్చాడు. "ఎంఎం సినిమాలు చేసావ్" అని దీపికా ఆదిని కొట్టి మరీ అడిగింది. "ముద్దిస్తే చెప్తా" అని ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే "ఛీ" అంది దీపికా. "ఎహె సినిమా పేరే ముద్దిస్తే చెప్తా" అని చెప్పేసరికి "బాగా ఆడిందా" అని ప్రదీప్ అడిగాడు..
"రెండున్నర గంటలు తీసాం..కానీ మొత్తం సెన్సార్ లో పోయింది" అని ఆది చెప్పేసరికి ప్రదీప్ షాకయ్యాడు. "ఇంత కత్తి లాంటి డైరెక్టర్ కి కత్తి లాంటి హీరో కావాలి" అని ప్రదీప్ అనేసరికి "మా చుట్టమోకడు భోజ్పూరి హీరోలా ఉంటాడు" అనేసరికి మెరుపుల డ్రెస్ తో డాన్సర్ పండు స్టేజి మీద ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత బట్టలిప్పేసి స్టేజి మీద పిచ్చిపట్టినట్టు డాన్స్ చేసేసాడు. ఇక చివరికి "సందీప్ హై స్కూల్" పేరుతో చేసిన డాన్స్ కి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయాడు. ఇక స్టేజి మీద ఉన్న కొరియోగ్రాఫర్స్ అంతా కూడా "హ్యాపీ టీచర్స్ డే" మాస్టర్ అంటూ మోకాళ్ళ మీద వంగి ఆయన ప్రణామం చేశారు. ఇక ఇందులో పెర్ఫార్మెన్సెస్ అన్ని కూడా చాలా కొత్తగా ఫ్రెష్ థీమ్ తో కంపోజ్ చేసేసరికి అవన్నీ కూడా శేఖర్ మాస్టర్ కి బాగా నచ్చాశాయి అలాగే ఆయన కూడా ఆ ఊపులో స్టేజి మీదకు వచ్చి కొన్ని స్టెప్స్ కూడా వేసెళ్లారు..
![]() |
![]() |